: ఏపీ రాజ్యసభ సీటును తెలంగాణకు కేటాయించే ప్రశ్నేలేదు: లోకేష్
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు తమను పంపించాలని పలువురు తెలంగాణ టీడీపీ నేతలు చేస్తున్న విజ్ఞప్తులను ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కొట్టిపడేశారు. తెలంగాణ టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఈ రోజు విజయవాడలో చంద్రబాబును కలసి రాజ్యసభ సీటు అడిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో, కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ఏపీ కోటా రాజ్యసభ సీటును తెలంగాణ నేతలకు కేటాయించడం కుదరదని అన్నారు. అసలు ఏపీ రాజ్యసభ సీటును తెలంగాణకు కేటాయించడం ఎలా కుదురుతుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలందరికీ ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన చెప్పారు.