: అతనికి ఇసుకే ఆహారం...మట్టే పరమాన్నం!


అతనికి ఇసుకే ఆహారం, మట్టే పరమాన్నం. ఎంచక్కా, వాటిని చేతితో తీసుకుని లొట్టలేసుకుంటూ తినేస్తాడు హరిద్వార్ నివాసి రామేశ్వర్. అతనికి ఈ అలవాటు గత పదిహేడేళ్లుగా ఉంది. ఇసుక, మట్టి తిన్న తర్వాత కొంచెం గంగాజలం తాగితే అతని భోజనం పూర్తయినట్లే. ఈ సందర్భంగా రామేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ, మట్టి, ఇసుక తింటే చాలా బలం వచ్చినట్లే ఉంటుందని, ప్రతిరోజూ వీటిని తింటానని, గంగానదికి వెళ్లి నీళ్లు తాగుతానని చెప్పాడు. ప్రతిరోజూ మూడు సార్లు ఆహారంగా వీటిని తీసుకుంటానని, ఒక్కోసారి వంద గ్రాములకు పైగానే తింటానని చెప్పాడు. ఈ విషయమై సందీప్ నిగం అనే వైద్యుడు మాట్లాడుతూ... ఇదో రకమైన జబ్బు అని, దీని పేరు ‘పైకా’ అని చెప్పారు. ఈ వ్యాధితో బాధపడేవాళ్లు మట్టి, ఇసుక, ఇతర పదార్థాలు తింటుంటారని అన్నారు. చిన్నపిల్లలో కాల్షియం, మినరల్స్, ఐరన్ లోపించినప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, కొందరి మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు కూడా ఇలాంటి పనులు చేస్తుంటారని చెప్పారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News