: కుప్ప కూల్చేందుకు బీజేపీ పొంచివుంది... ఓ కంట కనిపెట్టండి: కొత్త సర్కారుతో కేరళ 'ఫిడేల్ క్యాస్ట్రో'


ఇండియాలోని ప్రగతిశీల కూటములు నడుపుతున్న ప్రభుత్వాలను కుప్ప కూల్చేందుకు కాషాయ మూలాలున్న బీజేపీ ఎంత మాత్రమూ వెనుకాడబోదని, ఆ పార్టీ అడుగులను వామపక్షాలు నిత్యమూ ఓ కంట కనిపెడుతుండాలని కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ సలహా ఇచ్చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తరువాత, అచ్యుతానందన్ ను కేరళ 'ఫిడేల్ క్యాస్ట్రో'గా అభివర్ణిస్తూ, ఇకపై ఆయన సలహాలు, సూచనలు మాత్రమే తీసుకుంటామని చెబుతూ, పినరాయి విజయన్ ను ముఖ్యమంత్రిగా నియమించిన సంగతి తెలిసిందే. లెఫ్ట్ పార్టీల నిర్ణయంపై తొలుత అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ, ఆపై మనసు మార్చుకున్న అచ్యుతానందన్ కొత్త క్యాబినెట్ కు అభినందనలు తెలుపుతూ ఫేస్ బుక్ లో పోస్టింగ్ పెట్టారు. విజయన్ నేతృత్వంలో పనిచేసే ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందడుగు వేయిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News