: పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లా శాయంపేటలో విషాదం చోటుచేసుకుంది. అక్కడి పెదకొండపాకలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈరోజు ఉదయం దేవేందర్, నవ్య పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కొంత కాలంగా ప్రేమలో ఉన్న తాము పెళ్లి చేసుకుంటామని పెద్దలకు చెబితే వారు ఒప్పుకోలేదని, దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ జంట ఆత్మహత్యాయత్యానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.