: కుస్తీ పోటీలను తలపించేలా నడిరోడ్డుపై మహిళల తన్నులాట... వీడియో వైరల్!
కుస్తీపోటీలను తలపించేలా నడి రోడ్డుపై నలుగురు మహిళలు తన్నుకున్న సంఘటన బ్రిటన్ లోని దక్షిణ యార్క్ షైర్లోని డోంకాస్టర్లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తీసిన వీడియోతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది. ‘నేను నిన్ను చంపేస్తాను’ అంటూ మహిళలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ సమాచారం అక్కడి పోలీసులకి తెలియడంతో ఇప్పుడు ఆ మహిళల కోసం గాలిస్తున్నారు. కుస్తీ పోటీల్లో కనిపించే దృశ్యాలని ఈ మహిళలు అక్కడి నడిరోడ్డుపై ప్రదర్శించారు. తాము మహిళలమన్న సంగతి కూడా మరచి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఓ మహిళ మరో మహిళను రోడ్డుపై కింద పడేసి కాలితో విపరీతంగా తన్నింది. చేతులతో ఆ మహిళ ముఖంపై ఆపకుండా పిడిగుద్దులు కురిపించింది. ఘటనకు సంబంధించిన వీడియో తమ వద్ద ఉందని, రోడ్డుపై తన్నుకోవడం నేరమని, త్వరలోనే సదరు మహిళలను పట్టుకుంటామని అక్కడి పోలీసులు మీడియాకు తెలిపారు.