: రైఫిళ్లు, కత్తులు పట్టుకుని సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్ నిర్వహించిన భజరంగ్ దళ్ పై కేసు నమోదు
భజరంగ్ దళ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్‌పై తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగుతోంది. భజరంగ్ దళ్ కార్యకర్తలు క్యాంప్‌లో పలు ఆయుధాలు పట్టుకొని తీసుకున్న శిక్షణ పట్ల తాజాగా కేసు నమోదైంది. మతం ప్రాతిపదికతో వివిధ సమూహాల మధ్య శత్రుత్వం పెంచేలా ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 153ఏ ప్రకారం ఈ క్యాంప్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్యాంప్ లో రైఫిళ్లు, కత్తులు పట్టుకొని శిక్షణ తీసుకుంటోన్న కార్యకర్తల వీడియోలు దేశ మంతటా వ్యాపించిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. అయితే, ఈ క్యాంప్ లో కార్యకర్తలు తమని తాము రక్షించుకోవడానికి శిక్షణనిస్తామని, తమని తాము రక్షించుకోలేని వారు దేశాన్నెలా రక్షిస్తారని భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.