: టీడీపీతో మిత్ర ప‌క్షంగానే వెళ‌తామా..? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేం: పురందేశ్వరి


తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగానే కొన‌సాగుతూ త‌దుప‌రి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై నిర్ణ‌యాన్ని తాము ఇప్పుడే చెప్ప‌లేమని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కురాలు పురందేశ్వ‌రి అన్నారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రులు రానున్న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో పాల్గొన్న పురందేశ్వ‌రి మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో త‌మ పార్టీని బ‌ల‌ప‌ర్చే దిశగానే దృష్టి పెట్టామ‌ని, టీడీపీతో పొత్తు అంశాన్ని గురించి ఎటువంటి నిర్ణ‌యాన్ని తెలప‌లేమ‌ని ఆమె వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేక హోదాపై బీజేపీపై ప‌లువురు చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను పురందేశ్వ‌రి ఖండించారు. త‌మ పార్టీ అధిష్ఠానం రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్ర‌యోజ‌నాల‌పై దృష్టి పెడుతూనే ఉంద‌ని ఆమె అన్నారు. ప్రత్యేక హోదాపై 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే సాధ్యం కావ‌డంలేద‌ని ఆమె అన్నారు. ఏపీకి బీజేపీ స‌మ‌కూర్చిన నిధులు, సంక్షేమ పథకాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ‌తామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News