: ఇంకా తెగని నీట్... ఆర్డినెన్స్ పై సుప్రీం తలుపు తట్టనున్న సంకల్ప్!


దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశపరీక్ష నీట్ పై ఇంకా సందిగ్ధత తొలగలేదు. నీట్ పై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ చట్ట విరుద్ధమని, దీన్ని రద్దు చేయాలని కోరుతూ సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, వైద్య రంగంలో సంస్కరణల అమలు మరింత ఆలస్యమవుతుందన్నది సంకల్ప్ ప్రధాన ఆరోపణ. న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాన్ని ఆర్డినెన్స్ తో పక్కన పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించిన సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ తరఫు న్యాయవాది అమిత్ కుమార్, కేంద్రం చర్య కోర్టుల నిర్ణయాన్ని అపహాస్యం చేసినట్టేనని వివరించారు. భారత చరిత్రలో సుప్రీం తీసుకున్న నిర్ణయాన్ని సంవత్సరం పాటు వాయిదా వేసిన ఘటన ఇంతవరకూ జరగలేదని, అందువల్ల ఈ నిర్ణయాన్ని సవాల్ చేయనున్నామని ఆయన తెలిపారు. కాగా, పలు రాష్ట్రాల విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేలా, నీట్ ను ఏడాది పాటు నిలిపివేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం పెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News