: డబ్బు కోసమే హష్మి హత్య... పోలీసుల అదుపులో పక్కింటి స్నేహితుడు
సోమవారం అదృశ్యమై ఈ ఉదయం మృతుడై కనిపించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వల్లిపల్లి హష్మి ఉదంతంలో నిందితుడు నరేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హష్మి ఇంటి పక్కనే నివసించే సురేష్, డబ్బు కోసమే ఈ హత్యను చేసినట్టు పోలీసులు వెల్లడించారు. హష్మి వద్ద ఉన్న రూ. 10 వేలు, బంగారు గొలుసు కోసం అతన్ని రాళ్లతో తలపై మోది చంపినట్టు తెలిపారు. వేవ్ రాక్ సంస్థలో పనిచేస్తున్న హష్మికి సురేష్ స్నేహితుడు కావడం గమనార్హం. తొలుత తనకేమీ తెలియదని సురేష్ బుకాయించగా, వారిద్దరూ కలిసి నడుస్తున్న సీసీ కెమెరాల దృశ్యాలను చూపి, తమదైన శైలిలో ప్రశ్నించేసరికి నిజాన్ని అంగీకరించాడు. దీంతో హష్మిని ఎక్కడ హత్య చేశానన్న విషయాన్ని చెప్పి, ఆపై ఘటనా స్థలికి తీసుకెళ్లాడు. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.