: ఎండ 'మంట'తో యజమానిని చంపేసిన ఒంటె!
ఎడారిలో, మండుటెండలో తనను కట్టేసి, ఆపై మరచిపోయిన యజమానిపై ఓ ఒంటెకు వచ్చిన కోపం అతని ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన రాజస్థాన్ లోని మంగ్తా అనే గ్రామంలో జరిగింది. ఊర్జారాం అనే వ్యక్తి వద్ద ఓ ఒంటె ఉండగా, దాన్ని కట్టేసి అతను వెళ్లిపోయాడు. ఆ పై ఓ పార్టీకి వెళ్లి ఒంటెను ఎండలో కట్టేశానన్న సంగతిని మరచిపోయాడు. చాలాసేపటి తరువాత గుర్తుకు వచ్చి ఒంటెను విడిపించాలని వెళ్లగా, అప్పటికే మంచి కాకమీదున్న ఆ ఒంటె, ఊర్జారాంను ఎత్తి పడేయటంతో పాటు తలపై కుమ్మేసింది. దీంతో తీవ్రగాయాలైన ఆ ఆసామి అక్కడికక్కడే మరణించారు. ఆపై ఆ ఒంటె శివాలెత్తినట్టు ప్రవర్తించగా, దాన్ని అదుపు చేయడానికి ఆరు గంటలకు పైగా సమయం పట్టిందట. మంటెత్తిస్తున్న ఎండలో కట్టేసి వెళ్లడం వల్లే అది ఇలా చేసుంటుందని గ్రామస్తులు అంటున్నారు.