: సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దారుణ హత్య... మృతుడు సీపీఎం నేత మధు సమీప బంధువు
హైదరాబాదులో మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. నగర శివారులోని లింగంపల్లి రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్న సదరు టెక్కీ మృతదేహాన్ని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హష్మిగా పోలీసులు గుర్తించారు. నగరంలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న హష్మిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. బండరాళ్లతో మోది అతడిని హత్య చేశారు. రైల్వే ట్రాక్ పక్కన టెక్కీ డెడ్ బాడీ పడి ఉందన్న వార్త నగరంలో కలకలం రేపుతోంది. హష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. మృతుడు హష్మి... సీపీఎం ఏపీ శాఖ కార్యదర్శి మధుకు సమీప బంధువుగా పోలీసులు గుర్తించారు.