: పాదయాత్ర ముగింపు సభకు జూనియర్ ఎన్టీఆర్ డుమ్మా!
చంద్రబాబు ప్రతిష్ఠాత్మక పాద యాత్ర 'వస్తున్నా మీ కోసం' ఈ రోజు సాయంత్రం విశాఖ నగరంలో ముగుస్తోంది. అయితే దీనికి పార్టీ ఎంపీ హరికృష్ణ ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావట్లేదని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ షూటింగులలో తీరిక లేకుండా ఉన్నారని, హరికృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన స్పర్థల వల్లే వారు పాదయాత్ర ముగింపు సభకు దూరంగా ఉండబోతున్నారని సమాచారం.