: ఉపాధి లేని కోర్సుల కారణంగానే నిరుద్యోగ సమస్య: సీఎం కేసీఆర్
విద్యార్థులకు ఉపాధి దొరికే కోర్సులనే ప్రవేశపెట్టాలని, ఉపాధి లేని కోర్సుల వల్లే నిరుద్యోగ సమస్య తలెత్తుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బోగస్ విద్యా సంస్థలు ఉండేందుకు వీల్లేదని కరాఖండిగా చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు కొనసాగుతాయని, ప్రైవేటు విద్యా సంస్థలు మూసేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదని అన్నారు. అత్యున్నత విద్యను అందించడంలో ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి అని, తెలంగాణను ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.