: ‘ఆస్కార్’కు అయితే రూ.కోటి... ‘కేన్స్’కు అయితే రూ.50 లక్షలు


‘ఆస్కార్’, ‘కేన్స్’ చిత్రోత్సవాల్లో పోటీపడే భారతీయ చిత్రాల నిర్మాతలకు కేంద్ర ప్రభుత్వం చేయూత నందించనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఆస్కార్, కేన్స్ వంటి ఫిల్మ్ అవార్డు ఉత్సవాలకు వెళ్లే భారతీయ సినిమాలకు ఆర్థిక సాయం చేయాలనుకుంటున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంతి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నారు. ‘ఆస్కార్’కు ఎంపికయ్యే చిత్రానికి రూ.కోటి, కేన్స్ కు అయితే రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని భావిస్తున్నట్లు రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తెలిపారు. భారత్ లో షూటింగ్ నిమిత్తం వచ్చే విదేశీ ఫిల్మ్ మేకర్లకు వీసా వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News