: విద్యుదాఘాతంతో యువకుడి మృతి.. మృతదేహంతో ధర్నాకు దిగిన తండా వాసులు
నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం కేసారంలో విద్యుదాఘాతానికి ఒక యువకుడు బలయ్యాడు. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యంతోనే యువకుడు చిన మల్లయ్య ప్రాణాలు కోల్పోయాడని రూప్లా తండా వాసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట ట్రాన్స్ కో డీఈ కార్యాలయం ఎదుట తండావాసులు ఆందోళనకు దిగారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. యువకుడి మృతదేహంతో తండా వాసులు ధర్నా చేస్తున్నారు.