: ఢిల్లీలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్


పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ ఒకటి పొలాల్లో అత్యవసర ల్యాండింగ్ అయిన సంఘటన ఈరోజు జరిగింది. ఎయిర్ అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఆల్ కెమిస్ట్ కు ఎయిర్ వేస్ కు చెందిన సీ-90 బీచ్ కింగ్ ఎయిర్ అంబులెన్స్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక పేషెంట్ వీరేంద్ర రాయ్ ను పాట్నా నుంచి ఢిల్లీ కి తీసుకువస్తున్నారు. ఇందులో ఒక డాక్టరు సహా మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు సమీపంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ అంబులెన్స్ రెండు ఇంజన్లు చెడిపోయాయి. దీంతో ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని నజఫ్ గఢ్ ప్రాంతంలోని పొలాల్లో పైలట్ అత్యవసరంగా దింపివేశాడు. వెంటనే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారులకు ఈ సమాచారం అందజేశాడు. పేషెంట్ వీరేంద్ర రాయ్ ను వెంటనే మేదాంత మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఎయిర్ అంబులెన్స్ ను అత్యవసరంగా దింపకపోతే కనుక పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News