: దయచేసి ఇక ఆపండి... తన హాట్ ఫోటోల హల్ చల్ పై ఎమ్మెల్యే అంగూర్ లత
తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న తన ఫోటోలపై అసోం బీజేపీ ఎమ్మెల్యే, హీరోయిన్ అంగూర్ లతా డేకా స్పందించారు. తనకు అందం దేవుడిచ్చిన వరమని, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తిగా సమాజంలో మార్పు తెచ్చేందుకు రాజకీయాల్లోకి వచ్చానని ఆమె చెప్పారు. టెక్నాలజీ పరంగా ఎదిగిన భారత్, మానసికంగా మాత్రం ఎదగలేదని వ్యాఖ్యానించిన ఆమె, తనపై దుష్ప్రచారం తగదని, దీన్ని ఆపాలని విన్నవించుకున్నారు. మార్స్ పై అడుగిడినా, మనుషుల మనస్తత్వాలు మాత్రం మారలేదని అన్నారు. తనను ప్రోత్సహించింది ప్రధాని మోదీయేనని చెప్పిన ఆమె, తనను హాట్ ఎమ్మెల్యే అనవద్దని కోరారు. కాగా, భత్రదేవ నియోజకవర్గంలో అంగూర్ లత పోటీ చేసి విజయం సాధించగా, అప్పటినుంచి ఆమె హీరోయిన్ గా ఉన్న సినిమాల్లోని గ్లామర్, హాట్ చిత్రాలెన్నో దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.