: నార్సింగ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన బాలిక‌పై అత్యాచారం కేసులో నిందితుల అరెస్ట్‌


ప‌దిరోజుల క్రితం నార్సింగ్‌లో ఓ బాలిక‌ను పొద‌ల్లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు నిందితులను ఎట్ట‌కేల‌కు ఈరోజు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. ప‌దిరోజుల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర అల‌జ‌డి సృష్టించింది. హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గండిపేట సమీపంలో కొందరు దుండ‌గులు దొంగ‌తనానికి వ‌చ్చి రెచ్చిపోయారు. రాత్రిపూట ఓ ఇంట్లో దొంగ‌త‌నానికి య‌త్నించారు. అయితే ఓ మైన‌ర్ బాలిక దొంగ‌ల‌ను గ‌మ‌నించి కేక‌లు వేసే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఆమెను దుప్ప‌ట్లో చుట్టి, ద‌గ్గ‌ర‌లోని పొద‌ల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించి ఎట్ట‌కేల‌కు వారిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News