: సరికొత్త వాట్స్ యాప్... ఆన్సరింగ్ మెషీన్, క్యూఆర్ కోడ్ లో చాట్స్!


స్మార్ట్ ఫోన్లలో సామాజిక మాధ్యమ సేవలందిస్తున్న వాట్స్ యాప్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ, కస్టమర్లకు మరింత అనుభూతిని పంచుతుందనడంలో సందేహం లేదు. తాజాగా వాట్స్ యాప్ కు మరిన్ని విప్లవాత్మక మార్పులను తెస్తూ, కొత్త ఫీచర్లు జోడించబడ్డాయి. వాటిల్లో వాయిస్ మెయిల్, ఆన్సరింగ్ మెషీన్, క్యూఆర్ కోడ్స్ పంపుకునే వెసులుబాటు ముఖ్యమైనవి. వాట్స్ యాప్ ద్వారా మీ మిత్రుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారా? మీరు ఆటోమేటిక్ వాయిస్ మెయిల్ ను వారికి పంపవచ్చు. పర్సనలైజ్ చేయబడ్డ వాయిస్ మెయిల్ ఫీచర్ వాట్స్ యాప్ కు జత కానుంది. ఇదే సమయంలో కొత్త కాంటాక్ట్ లతో చాట్ చేయాలంటే, వారి మొబైల్ నంబర్ ను సేవ్ చేసుకునే అవసరమూ తప్పిపోనుంది. ఇక వివిధ వెబ్ సైట్లకు దారితీసే క్యూఆర్ కోడ్ లనూ వాట్స్ యాప్ ద్వారా పంచుకునే వీలు కలుగుతుంది. ఇక గ్రూప్ చాట్స్ చేస్తున్న వేళ, లేటెస్ట్ మెసేజ్ కి తీసుకువెళ్లే ఓ సరికొత్త బటన్ సైతం వాట్స్ యాప్ కు జత కానుంది. ఈ ఫీచర్లన్నీ ఇప్పుడు పరీక్షాదశలో ఉన్నాయని, త్వరలో వెలువడే కొత్త వర్షన్ లో చోటు చేసుకుంటాయని టెక్ నిపుణుల అంచనా.

  • Loading...

More Telugu News