: 'జన్ ధన్' ఖాతాలతో ఎంతటి మోసాలకైనా అవకాశం ఉంది: హెచ్చరించిన ఆర్బీఐ


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన జన్ ధన్ ఖాతాల్లో నగదు మోసాలు భారీగా జరిగే అవకాశాలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఈ ఖాతాల్లో జరిగే లావాదేవీలను బ్యాంకులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా బ్యాంకులకు సూచించారు. "ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) కింద కొత్తగా ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో మోసాలకు ఎంతో అవకాశం ఉంది. ఈ ఖాతాల్లో కేంద్రం వేస్తున్న డబ్బు, లావాదేవీలపై నిరంతర నిఘా అవసరం. నేరగాళ్లు వీటిని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడవచ్చు. ఈ ఖాతాల్లో ఎన్నో దుర్వినియోగం అవుతున్న ఖాతాలూ ఉండవచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల వాడకంలో లేని ఓ ఖాతా నుంచి ఖాతాదారుడికి తెలియకుండా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగిన విషయాన్ని ముంద్రా గుర్తు చేశారు. పంజాబ్ లోని ఓ రోజువారీ కూలీ ఖాతా నుంచి రూ. కోటి విలువైన లావాదేవీలు జరిగాయని, జన్ ధన్ ఖాతాలనూ ఇదే విధమైన మోసాలకు వాడవచ్చని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News