: ఓకే... రైట్ రైట్!: తాత్కాలిక సచివాలయం పనులపై చంద్రబాబు సంతృప్తి


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావులను వెంటబెట్టుకుని నేటి ఉదయం చంద్రబాబు వెలగపూడికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో కొనసాగుతున్న వేగంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థల అధికారులు చంద్రబాబుకు చెప్పారు. వచ్చే నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఉద్యోగులను హైదరాబాదు నుంచి అమరావతి తరలించాలని నిర్ణయించామని, పనుల్లో మరింత వేగాన్ని పెంచాలని ఆయన వారికి సూచించారు.

  • Loading...

More Telugu News