: బొగ్గు స్కాంలో మరో కంపెనీపై సీబీఐ కేసు
కలకలం రేపుతున్న బొగ్గు కుంభకోణం వ్యవహారంలో 'పుష్ప్ స్టీల్ ప్రయివేట్ లిమిటెడ్' కంపెనీపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. నాడు బొగ్గు బ్లాకుల కోసం చేసుకున్న దరఖాస్తులో ఈ కంపెనీ తప్పుడు వివరాలు పొందుపరిచినట్లు సిబిఐ గుర్తించింది. దీంతో సీబీఐ అధికారులు హర్యానా, ఢిల్లీలోని నర్వాణ, రాయ్ పూర్ లో ఉన్న ఈ కంపెనీ కార్యాలయం సహా దేశవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. కోల్ స్కాం వ్యవహారంలో నిన్న సుప్రీంకోర్టులో సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.