: సెప్టెంబరులో మినీ ఐపీఎల్... బీసీసీఐ కొత్త ప్లాన్!


దాదాపు నెలన్నర రోజులుగా అలరించిన ఐపీఎల్ పోటీలు చివరిదశకు వచ్చిన నేపథ్యంలో, క్రికెట్ మజాను కోల్పోతున్నామని బాధపడే వీర ప్రేమికులకు శుభవార్త. సెప్టెంబరులో మినీ ఐపీఎల్ రానుంది. ఇందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సైతం ఆమోదం పలికే అవకాశాలు ఉన్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అయితే, ఈ మినీ ఐపీఎల్ విదేశాల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. "అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆర్థికంగా కూడా ఉపకరిస్తుంది. అమెరికా వంటి దేశాన్ని మ్యాచ్ ల కోసం ఎన్నుకోవాలని భావిస్తున్నాం" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబరులో అంతర్జాతీయ టోర్నీని నిర్వహించే వీలుండటంతో, ఆ దిశగా ఏదైనా టోర్నమెంట్ పెట్టాలని భావిస్తున్న ఐసీసీ, ప్రస్తుత బీసీసీఐ ఆలోచనకు ఎంతమాత్రం సహకరిస్తుందో తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News