: అసోం సీఎంగా సోనోవాల్ ప్రమాణం నేడే... హాజరుకానున్న చంద్రబాబు, అమిత్ షా
బీజేపీ యువ నేత, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్... తన సొంత రాష్ట్రం అసోంలో సత్తా చాటారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చారు. ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో సర్బానంద కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి అసోం సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు నేడు గువాహటిలో ఆ రాష్ట్ర గవర్నర్... సోనోవాల్ తో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి సోనోవాల్ ఆహ్వానం పంపారు. ఇక పార్టీ తరఫున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందింది. దీంతో సోనోవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు మరికాసేపట్లో గువాహటికి బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమానికి అమిత్ షా కూడా హాజరుకానున్నారు.