: సీబీఐ ముందుకు ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్!... స్టింగ్ ఆపరేషన్ పై నేడు కీలక విచారణ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ సీఎం హరీశ్ రావత్ నేడు సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంలో న్యాయస్థానాల పుణ్యమా అని హరీశ్ రావత్ తన అధికారాన్ని నిలుపుకున్నారు. అయితే తన పార్టీ ఎమ్మెల్యేను లాగేసుకున్న బీజేపీకి కౌంటర్ ఇచ్చే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలతో హరీశ్ రావత్ మంతనాలు సాగించారు. బీజేపీ ఎమ్మెల్యేలకు తాయిలాలు ఎర వేస్తూ హరీశ్ రావత్ స్టింగ్ ఆపరేషన్ కు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంపై ప్రశ్నించేందుకు సీబీఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిలుపుతో ఆ సంస్థ అధికారుల ముందు విచారణకు హరీశ్ రావత్ హాజరుకానున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.