: వెలగపూడికి చంద్రబాబు... తాత్కాలిక సచివాలయ నిర్మాణాలపై సమీక్ష
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరికాసేపట్లో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలోని వెలగపూడికి బయలుదేరనున్నారు. వచ్చే నెల 27 నాటికి సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నిర్మాణాలను పరిశీలించేందుకే చంద్రబాబు వెలగపూడికి వెళ్లనున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడంతో పాటు అధికారులతో చంద్రబాబు సమీక్ష చేయనున్నారు.