: సీఎం జయలలిత తాజా నిర్ణయం... మంత్రి వర్గంలో మరో నలుగురికి స్థానం!


తమిళనాడు సీఎం జయలలిత కేబినెట్ లో మరో నలుగురు మంత్రులు కొత్తగా చేరనున్నారు. ఈ మేరకు గవర్నర్ రోశయ్యకు ఒక జాబితాను జయ సర్కార్ అందజేసింది. కొన్నిగంటల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ లో మరో నలుగురికి స్థానం కల్పించడం ద్వారా తన మంత్రి వర్గాన్ని విస్తరించాలని ఆమె నిర్ణయించారు. దీంతో నలుగురి పేర్లతో కూడిన జాబితాను గవర్నర్ రోశయ్య కు పంపారు. కొత్తగా మంత్రి పదవులు పొందనున్నవారిలో జీ.భాస్కరన్, ఎస్.రామచంద్రన్, నిలోఫర్ కబిల్, పి.బాలకృష్ణారెడ్డి ఉన్నారు. గవర్నర్ ఈ నలుగురితో రేపు ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. కాగా, ఈ రోజు మధ్యాహ్నం సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం జయలలిత కేబినెట్ లోని మొత్తం 28 మంది మంత్రులు కూడా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News