: పాట్నా యూనివర్సిటీలో ఉద్రిక్తత... మరోసారి వివాదంలో వీసీ సింహాద్రి


పాట్నా యూనివర్సిటీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. యూనివర్సిటీలో కఠిన నిబంధనలు అమలు చేస్తుండడంతో తమకు అన్యాయం జరుగుతోందని విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేఫధ్యంలో యూనివర్సిటీ వీసీ సింహాద్రి నివాసాన్ని ముట్టడించేందుకు విద్యార్థులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న హింసను నివారించేందుకు వీసీ సింహాద్రి సెక్యూరిటీ గార్డు జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్ధికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వివాదం రేగింది. నిబంధనలను కఠినంగా అమలు చేసే వీసీ సింహాద్రి గతంలో ఆంధ్రయూనివర్సిటీ వీసీగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News