: టీఎస్ టెట్ సరిగా రాయలేదని ఎంపీటీసీ ఆత్మహత్య
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) సరిగా రాయలేదని మనస్తాపం చెందిన ఎంపీటీసీ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ మండలంలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన టెట్ పరీక్షకు బుక్కాపురం ఎంపీటీసీ స్వరూప హాజరయ్యారు. పరీక్ష రాసిన అనంతరం తనకు ఎన్ని మార్కులు వస్తాయో లెక్క వేసుకుంది. తక్కువ మార్కులు వస్తాయని భావించిన స్వరూప ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.