: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి నారాయణ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేసి తీరుతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరులో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. జూన్ నాటికి తాత్కాలిక భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పారు.