: జగన్ కు దాచుకోవడం, దోచుకోవడం తప్పా రాష్ట్రాభివృద్ధి పట్టదు: మంత్రి గంటా
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దాచుకోవడం, దోచుకోవడం తప్పా రాష్ట్రాభివృద్ధి పట్టదని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. కడపలోని మేడా కన్వెన్షన్ హాలులో టీడీపీ మినీ మహానాడుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి జగన్ అడ్డంకిగా మారారని, కడప జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకువస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా 13 తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్ మల్లికార్జునరెడ్డి, శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ తదితరులు హాజరయ్యారు.