: కంగనా సరసన 'హీరోయిన్'గా నటించేందుకు సిద్ధమని ప్రకటించిన బాలీవుడ్ హీరో


బాలీవుడ్ లో హీరోలతో సమానమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న కంగనా రనౌత్ ను బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ హీరోగా పేర్కొన్నాడు. క్వీన్, తనువెడ్స్ మను సినిమాల్లో హీరోగా నటించిన కంగనా నటించే సినిమాలో తాను 'హీరోయిన్‌'గా నటిస్తానంటూ ఇర్ఫాన్‌ ఖాన్‌ ఛలోక్తి విసిరాడు. దీనికి స్పందించిన కంగనా ఆయన పక్కన ఏ పాత్రలోనైనా నటించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇర్ఫాన్‌ తనను ఎప్పుడూ ఆటపట్టిస్తుంటాడని, అందులో భాగంగా తనతో సినిమా చేయమంటే...రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడలేవని అన్నాడని గుర్తు చేసుకుంది. అయితే అప్పట్లో అది తనకు అర్థం కాలేదని, ఇప్పుడు అర్థమైందని చెప్పింది. అయినప్పటికీ ఆయనతో పనిచేసే అవకాశం వస్తే, ఆయన సరసన ఏ పాత్రలో అయినా నటించేందుకు సిద్ధమని ప్రకటించింది.

  • Loading...

More Telugu News