: ఆర్డీఎస్ ఎత్తు పెంచితే సీమ ఎడారవుతుంది: ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
ప్రత్యేక హోదా, తెలంగాణ ప్రాజెక్టుల అంశంలో తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ఈరోజు కర్నూలు జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కాపాడుతూ రాష్ట్రపాలన విధులు నిర్వహిస్తున్నారని కేఈ అన్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, మరో ఇరవై సంవత్సరాలు దాటినా ప్రజలు జగన్‌ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోరని ఆయన విమర్శించారు. రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్)లో భాగంగా కర్నూలులో ఆనకట్ట నిర్మించడం, ఎత్తుపెంచడం వంటివి చేస్తే రాయలసీమ నీళ్లు దొరక్క ఎడారి ప్రాంతంలా మారిపోతుందని ఆయన అన్నారు.