: ప్రియాంకా చోప్రా మనసు దోచిన గాయని!


'రోమ్ లో ఉంటే రోమన్ లా ఉండు' అనే సామెతను బాలీవుడ్‌ నటులు బాగానే ఒంటబట్టించుకున్నట్టున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లిన ప్రియాంక చోప్రా అక్కడి వ్యవహార శైలికి అలవాటు పడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఓ హాలీవుడ్ గాయనిపై క్రష్ ఉందంటోంది. మే 22న లాస్‌ వెగాస్‌ లో జరిగిన బిల్‌ బోర్డ్‌ మ్యూజిక్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రముఖ గాయని మేగన్‌ ట్రైనర్‌ పాటలు తనను మైమరపించాయని, దీంతో ఆమెపై క్రష్ ఏర్పడిందని ట్విట్టర్లో ప్రియాంక పేర్కొంది. ఈ మేరకు మేగన్‌ తో దిగిన ఫొటోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్టు చేసింది. దీంతో సోషల్ మీడియాలో పలు రకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News