: హైదరాబాద్‌లో దారుణం.. యువతి మెడపై కత్తి పెట్టి బంధువు అత్యాచారం
హైదరాబాద్ శివారు కూకట్ పల్లి సమీపంలోని ప్రగతినగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి మెడపై కత్తి పెట్టి సమీప బంధువు అత్యాచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్ నవ్యరాజధాని అమరావతిలో యువతి పేరుపై ఉన్న భూమికోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెప్పారు. అమరావతిలోని భూమి కోసం అమ్మాయిని తన అధీనంలో పెట్టుకోవాలని యోచించే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడికి ఆ యువతి వరసకు మరదలు అవుతుందని చెప్పారు. యువతిపై అత్యాచారం చేసి, న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ నిందితుడు ఆమెను బెదిరించాడని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నాటకాలాడాడని తెలిపారు. బలవంతంగా లొంగదీసుకుంటే ఆ యువతి జీవితాంతం తాను చెప్పిన మాట వింటుందని నిందితుడు భావించాడని పోలీసులు చెప్పారు.