: కేటీఆర్ ‘ఆపిల్’ మ్యాప్స్ ప్రసంగం వీడియోకు భారీ స్పందన


నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో ఆపిల్ మ్యాప్స్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. కేటీఆర్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఉంచిన ఈ ప్రసంగ వీడియోకు భారీ స్పందన లభించింది. నిన్న రాత్రి పదిగంటల వరకు నమోదైన వివరాల ప్రకారం... 72,51,248 మంది వీక్షకులకు ఆ వీడియో చేరింది. ఆ వీడియోను పూర్తిగా చూసిన వీక్షకుల సంఖ్య 22,75,393. స్పందించిన వీక్షకుల సంఖ్య 2,38,355. అంతేకాకుండా ఈ ప్రసంగ వీడియోను షేర్ చేసుకోవడం, కామెంట్లు పెట్టడం చేశారు. కాగా, ఇలాంటి మంత్రి మాకూ ఉంటే బాగుండేదని కొందరు, కొన్ని రోజులు మా రాష్ట్రానికి పంపాలని మరికొందరు కామెంట్ చేయగా, 'కేటీఆర్ ను కలుస్తా'నంటూ గుజరాత్ ఇన్నోవేషన్ సొసైటీ చైర్మన్ సునీల్ షా కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News