: ఐదురాష్ట్రాల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచింది తక్కువే!
ఇటీవల ప్రకటించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకి ఓటర్లు చేదు ఫలితాలనే ఇచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొత్తం 3500 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో కేవలం 9మందికే ఓటర్లు జై కొట్టారు. వీరిలో ఆరుగురు కేరళ ఎన్నికల్లో విజయం సాధిస్తే, తమిళనాడులో స్వతంత్ర అభ్యర్థులు ఒక్కరు కూడా ఎన్నిక కాలేదు. మిగతా మూడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున ఎన్నికయ్యారు. ఏప్రిల్ 4నుంచి ఈనెల 16వరకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో వరసగా 294, 232, 140, 126, 30 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మొత్తం 8873మంది పోటీ చేశారు. వారిలో 3,500 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు.