: ఇంట్లో అన్నం కూడా పెట్టవద్దు: బీజేపీ నేతల భార్యలకు నటుడు శివాజీ సలహా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాకు దూరమై, అప్పుల్లో కూరుకుపోవడానికి బీజేపీ నేతలే కారణమని, వారి భార్యలు ఇంట్లో అన్నం కూడా పెట్టకుండా మాడ్చితేనే వారికి బుద్ధి వస్తుందని నటుడు శివాజీ సలహా ఇచ్చారు. బీజేపీ కేంద్ర మంత్రులు పర్యటనలకు వస్తే అడ్డుకోవాలని, వారికి బయట తిరగనీయలేని పరిస్థితి కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. అతి త్వరలో 'బీజేపీ హఠావో - ఆంధ్రా బచావో' నినాదంతో ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపిన ఆయన, బీజేపీ నేతలెవరికీ, వారి భార్యలు సహకరించరాదని కోరారు. ఏపీని అడుక్కునే పరిస్థితికి తెచ్చిన వారికి బుద్ధి చెప్పే బాధ్యత వారి ఇంట్లోని మహిళలదేనని అన్నారు.