: జయ ప్రమాణం మాత్రమే సింగిల్ గా!... తమిళ మంత్రులంతా సామూహికంగా ప్రమాణం చేసిన వైనం


దేశంలో తమిళనాడు అంటేనే ఓ ప్రత్యేక రాష్ట్రం. ప్రాంతీయ భాషాభిమానం మెండుగా కలిగిన ఆ రాష్ట్ర వాసులు ఎక్కడికెళ్లినా తమ మాతృభాషను మరువరు. అంతేకాదు, వారి ఆచార వ్యవహారాలు కూడా ఇతర రాష్ట్రాల వారి కంటే భిన్నంగానే ఉంటాయి. స్థానికతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే తమిళ తంబీలు తమ సంప్రదాయ పంచెకట్టు అంటే అమితాసక్తి చూపుతారు. ఇక రాజకీయాల్లోనూ తమిళులకు ఓ ప్రత్యేకత ఉంది. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రాంతీయ పార్టీలదే హవా. డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే అసలు సిసలు పోటీ. ఇంతటి ప్రత్యేకత ఉన్న తమిళనాడులో కొద్దిసేపటి క్రితం వరుసగా రెండో పర్యాయం సీఎంగా పదవీ ప్రమాణం చేసిన జయ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాను మాత్రం సింగిల్ గానే ప్రమాణం చేసిన జయలలిత... తన కేబినెట్ మంత్రులు 28 మంది చేత సామూహికంగా ప్రమాణం చేయించారు. మద్రాస్ వర్సిటీలో కొద్దిసేపటి క్రితం ముగిసిన ప్రమాణ స్వీకారోత్సవంలో జయ ప్రమాణం తర్వాత మంత్రులంతా వరుసగా నిలబడి... వరుసగా తమ పేర్లు చెప్పుకుని... ఆ తర్వాత అంతా కలిసి ఒకేసారి ప్రమాణం చేశారు.

  • Loading...

More Telugu News