: చంద్రబాబుకో హఠావో!... ఆంధ్రాకో బచావో!: నినాదాలతో హోరెత్తించిన కేవీపీ


కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు నిరసనగా ఏపీ కాంగ్రెస్ శాఖ విజయవాడలో కొద్దిసేపటి క్రితం మొదలుపెట్టిన ఆందోళనలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు నినాదాలతో హోరెత్తించారు. ప్రధానంగా ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన పలు ప్రయోజనాలను సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విరుచుకుపడ్డారు. అంతేకాక విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రకటించాల్సిన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు మెదపకపోవడాన్ని ఆయన తూర్పారబట్టారు. ‘చంద్రబాబుకో హఠావో... ఆంధ్రాకో చావో‘, ‘మోదీ కో హఠావో... ఆంధ్రాకో బచావో’, ‘టీడీపీ, బీజేపీ హఠావో... ఆంధ్రాకో బచావో’ అంటూ కేవీపీ నినదించారు. పెద్ద స్వరంతో కేవీపీ నినాదాలు చేయగా, నిరసన ప్రదర్శనకు హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కూడా ఆయనతో గొంతు కలిపారు. దీంతో విజయవాడలోని లెనిన్ సెంటర్ కేవీపీ నినాదాలతో మారుమోగింది.

  • Loading...

More Telugu News