: 'ఓం' అనడంలో ఎలాంటి తప్పూ లేదు: ఉపరాష్ట్రపతి సతీమణి సల్మా అన్సారీ


అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేద మంత్రాలను చదవడం, 'ఓం' అని ఉచ్చరించడంలో తప్పేమీ లేదని ఉపరాష్ట్రపతి మహమ్మద్ హమీద్ అన్సారీ సతీమణి సల్మా అన్సారీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, ఓం అని అన్నా, అల్లా అన్నా, రబ్ అన్నా తేడా ఏమీ ఉండదని, దైవాన్ని తలచుకోవడంలో విభేదాలు ఎందుకని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆమె కోరారు. యోగా దినోత్సవాన్ని 'ఓం' అనడం ద్వారా ప్రారంభించాలని కేంద్రం ప్రతిపాదించగా, విపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. "నేను యోగా చేయకుంటే, కొన్ని ఎముకలు దెబ్బతిని ఉండేవి" అని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News