: రూపా గంగూలీపై విరుచుకుపడ్డ ‘తృణమూల్’!... బీజేపీ మహిళా నేత తలకు గాయాలు!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా సమీపంలో నిన్న బీజేపీ మహిళా నేత, నటి రూపా గంగూలీపై దాడి జరిగింది. విజయ గర్వంతో రెచ్చిపోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తనపై మెరుపు దాడికి దిగారని గంగూలీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో రూపా గంగూలీ తలకు బలమైన గాయాలయ్యాయి. 24 పరణాల జిల్లా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో రూపా గంగూలీ కాన్వాయ్ పై తృణమూల్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా, తమను దుండగుల నుంచి ఏమాత్రం కాపాడలేదని, మొత్తం ఘర్షణను పోలీసులు చోద్యం చూశారని ఆరోపించారు. దాడి అనంతరం రూపాతో పాటు ఆమె అనుచరులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు.