: కేసీఆర్ దత్తత గ్రామంలో బీజేపీ నేతలపై చెప్పులు, చీపుర్లు విసిరిన టీఆర్ఎస్ కార్యకర్తలు!


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు దత్తత గ్రామం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ లో నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ నేతలను గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు, చీపుర్లు చేతబట్టి రంగంలోకి దిగడంతో బీజేపీ నేతలు షాక్ తిన్నారు. సీఎం దత్తత గ్రామంలోనే విపక్షాల పరిశీలనకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ నేతల ఆందోళనకు నిరసనగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రోడ్డుపైనే వారికి ఎదురుగా బైఠాయించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత రంగప్రవేశం చేసిన పోలీసులు కూడా పరిస్థితిని చక్కదిద్దడం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలకు సర్దిచెప్పడంతో పోలీసుల భద్రత మధ్యే బీజేపీ నేతల పర్యటన కొనసాగింది. దీంతో గ్రామంలో రెండు గంటలకు పైగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News