: 'కరణం' బల ప్రదర్శనపై చంద్రబాబు కన్నెర్ర!... పార్టీలో కొట్లాటలను సహించబోనని హెచ్చరిక!


టీడీపీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా మినీ మహానాడులో పార్టీ సీనియర్ నేత కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై నిన్న చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా పార్టీలో చేరిన నేతలతో కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన పార్టీ సీనియర్లు ఘర్షణకు దిగడమేమిటని చంద్రబాబు ఒకింత అసహనానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన కరణం బలరాం బల ప్రదర్శనపై మండిపడినట్టు సమాచారం. ఇకపై పార్టీలో నేతల మధ్య కొట్లాటలను సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. ఘర్షణ వైఖరిని మార్చుకోని నేతలపై కఠిన చర్యలకు కూడా వెనుకాడేది లేదని కూడా ఆయన ప్రకాశం జిల్లా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News