: హోదాపై కేంద్రం దొంగాట : మంత్రి అయ్యన్న
ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం దొంగాట ఆడుతోందని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆదివారం విశాఖలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో మాట్లాడుతూ... విభజన హామీలను కేంద్రమే నెరవేర్చాలన్నారు. ఏపీకి ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రధాని మోదీ నిలబెట్టుకోవాలని ఆశించారు. త్వరలో జరిగే గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు.