: ఫేస్ బుక్ లో ఫారిన్ ట్రిప్ ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నారా.. జాగ్రత్త!


ఆదాయపన్ను పరిధిలోకి వచ్చే స్థాయిలో రెండు చేతులా సంపాదిస్తూ వాస్తవాలను రిటర్నులలో చూపకుండా కొంత పన్ను ఎగ్గొడుతున్న వారికి ఓ హెచ్చరిక. ఇలా కట్టాల్సినంత పన్ను కట్టకుండా తప్పించుకుంటున్న వారి ఫేస్ బుక్ ఇతర సామాజిక మాధ్యమాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు కన్నేశారు. భూతద్దం పట్టుకుని మరీ అన్వేషిస్తున్నారు. విదేశీ పర్యటనల పోస్టింగ్ లు, ఫొటోలు, 'ఇదిగో నా కొత్త కారు' అంటూ ఇలా పన్ను పడే విషయాలకు సంబంధించిన పోస్టింగ్ చేశారో ఐటీ నిఘాకు చిక్కినట్టే. మెట్రో నగరాల్లోనే కాదు, చిన్న పట్టణాల్లోని ఐటీ అధికారులు సైతం పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా పోస్టులను పరిశీలిస్తున్నారట. అయితే, ఈ వివరాలన్నవి కేవలం పన్ను చెల్లింపు దారుల వివరాలను మదింపు చేసేందుకేనని ఐటీ అధికారులు అంటున్నారు. వాస్తవానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నిబంధనల మేరకు నిర్ణీత పరిమితి దాటి చేసే లావాదేవీల వివరాలను ఏటా ఆదాయపన్ను శాఖకు సమర్పిస్తుంటాయి. రిటర్నులు దాఖలు చేయకపోయినా, పన్ను చెల్లించకపోయినా తప్పించుకోకుండా ఐటీ శాఖ ఒక్కో దారిని వరుసగా మూసుకుంటూ వస్తోంది.

  • Loading...

More Telugu News