: సీఎం కేసీఆర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. చీటింగ్ కేసు నమోదు చేయాలంటున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మరిచారని, ఏ ఒక్క హామీని అమలు చేయలేదని అన్నారు. ఈ మేరకు కరీంనగర్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ పై చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరారు. కేసీఆర్ కు భయపడి కనుక కేసు నమోదు చేయకపోతే తాను కోర్టుకు వెళతానని పొన్నం పేర్కొన్నారు.