: ‘టెట్’కు హాజరైన నిండు గర్భిణీ.. బిడ్డకు జన్మనిచ్చి ఆపై పరీక్ష రాసింది!


తెలంగాణలో ఈరోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు హాజరైన గర్భవతికి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించగా ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగింది. మల్దకల్ మండలానికి చెందిన కవిత 9 నెలల గర్భవతి. మోడ్రన్ హైస్కూల్లో టెట్ పరీక్ష రాసేందుకని నిర్దేశిత సమయం కన్నా ముందే ఆమె పరీక్షా కేంద్రానికి చేరుకుంది. కొద్ది సేపటి తర్వాత, నిండు గర్భిణీ అయిన ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో, 108కు ఫోన్ చేసి సమాచారం చెప్పడంతో వాహనం అక్కడికి చేరుకుంది. వెంటనే కవితను జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆడపిల్లను ప్రసవించింది. అయితే, ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండానే బాలింతరాలైన కవిత మళ్లీ పరీక్షా కేంద్రానికి వెళ్లి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసింది.

  • Loading...

More Telugu News