: డీఎండీకే కార్యకర్త ఆత్మహత్య... విజయ్ కాంత్ ఆవేదన


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే ఘోర పరాభవం పాలవడంతో తీవ్ర మనోవేదన చెందిన ఆ పార్టీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడలూరు జిల్లా అన్నాగ్రామం సమీపంలోని కొంగరాయనూర్ ప్రాంతానికి చెందిన సుబ్రమణి డీఎండీకే ప్రాంతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా సాధించలేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందిన సుబ్రమణి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటపై డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్రమణి ఆత్మహత్య వార్త విని తాను చలించిపోయానని, మనో ధైర్యంతో కార్యకర్తలందరూ ఉండాలని ఆయన అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, జీవితంలో పోరాడి గెలవాలి తప్పా, ఓడిపోయామని చెప్పి ఆత్మహత్యకు పాల్పడటం సరికాదని డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోయిన విజయ్ కాంత్ కార్యకర్తలకు సూచించారు.

  • Loading...

More Telugu News