: రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలను నిరోధించేందుకే ఆ ప్రచారం!: స్మృతీ ఇరానీ
రాజకీయాల్లో ప్రవేశించడం అన్నది చెడ్డపని కాదని, కష్టమైన పని అంతకన్నా కాదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. వాస్తవం చెప్పాలంటే, రాజకీయాల్లో ఎదగడం కన్నా కూడా పిల్లల్ని పెంచడమే కష్టమని అన్నారు. రాజకీయాలు కష్టమని, మహిళలకు సరైనవి కావని అంటూ జరిగే ప్రచారంపై ఆమె తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళలను నిరోధించాలనే ఉద్దేశంతోనే ఈ తరహా ప్రచారం చేయటం, ప్రకటనలు గుప్పించడం వంటివి జరుగుతుంటాయని చెప్పారు. అయితే, అటువంటి ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ఎవరినీ ఆదర్శంగా తీసుకోనని చెప్పిన స్మృతీ ఇరానీ, తనను ఆదర్శంగా తీసుకుంటున్నామని చాలామంది పురుషులు చెప్పడం విన్నానని ఆమె పేర్కొన్నారు.